ప్రతి నియోజకవర్గానికి పాతికవేల ఉద్యోగాలు పవన్ కళ్యాణ్ సంచలన హామీ..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) పిఠాపురంలో కొనసాగుతోంది.

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా సీఎం జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

నేరచరిత్ర కలిగిన వాళ్లు రాజకీయాల్లో ఉంటే నాకు చెడ్డ చిరాకు.భవిష్యత్తులో పిఠాపురం సాక్షిగా చెబుతున్నాను ఒక్కొక్క వైసిపి గుండా రాజకీయాల నాయకుల గుడ్డలూడదీసి కొట్టే రోజులు తీసుకొస్తాను అని చాలా పౌరుషంగా పవన్ కళ్యాణ్ డైలాగులు వేయడం జరిగింది.

ఈ క్రమంలో జనసేన పార్టీకి అధికారం అప్పచెపితే యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో హామీ ఇవ్వడం జరిగింది.

"""/" / "షణ్ముఖ వ్యూహం" అనే కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 500 మందికి.

ఒక్కొకరికి 10 లక్షల రూపాయలు ఆర్థికంగా పెట్టుబడి పెట్టుకోవడానికి సాయం అందిస్తామని స్పష్టం చేశారు.

వారు కనీసం మరో పదిమందికి ఉపాధి కల్పించే రీతిలో ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.

ఈ విధంగా ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో 2500 మంది యువ వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని తద్వారా ప్రతి నియోజకవర్గంలో 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని పవన్ పేర్కొన్నారు.

వృద్ధుడితో అఫైర్ పెట్టుకున్న ఆస్ట్రేలియన్ యువతి.. అతడిలో నచ్చింది ఇదేనట ..