Pawan Kalyan : ముద్రగడ, హరిరామ జోగయ్యపై పవన్ కల్యాణ్ పరోక్ష సెటైర్లు..!

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య,( Harirama Jogaiah ) కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై( Mudragada Padmanabham ) జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పరోక్షంగా సెటైర్లు వేశారు.

తనకు సలహాలు ఇచ్చిన వారంతా ప్రస్తుతం వైసీపీలోకి వెళ్లారన్నారు.ఎలా నిలబడాలో, ఎన్ని సీట్లు తీసుకోవాలో సలహాలు ఇచ్చారన్న పవన్ కల్యాణ్ సీట్లు ఇవ్వడం కూడా తనకు తెలియదా అని ప్రశ్నించారు.

రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడాలని పేర్కొన్నారు. """/" / టీడీపీ( TDP ) ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో తానూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నానన్న పవన్ మోదీతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు.

తానేం స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీపడలేదని తెలిపారు.

బంగ్లాదేశ్‌: రన్నింగ్ ట్రైన్ పైకెక్కి సెల్ఫీ వీడియో తీసిన ఇండియన్.. వీడియో చూస్తే!