పాన్ ఇండియా లెవల్లో ‘బ్రో’ ఓటిటి రిలీజ్.. ఇక్కడైనా ఆకట్టుకునేనా?

మెగా మల్టీస్టారర్ తో మామ అల్లుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే.

మెగా మల్టీస్టారర్ మూవీ ''బ్రో ది అవతార్''( Bro Movie ) జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ ముందు నుండి ఎన్నో అంచనాలు పెట్టుకుని ఆయన ఫుల్ సినిమాకు వెయిట్ చేసినంత వెయిట్ చేసారు.

"""/" / ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.

సముద్రఖని( Samuthirakhan I) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించగా ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసింది.కానీ మిక్స్డ్ టాక్ రావడంతో రెండవ రోజు నుండే డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.

ఇక మొత్తానికి థియేటర్స్ లో వారం రోజులకే రన్ ముగియగా భారీ నష్టాలను మూటగట్టుకుంది.

మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్( Netflix ) కొనుగోలు చేసిన విషయం విదితమే.

అలాగే ఈ సినిమా ఓటిటి రిలీజ్( Bro Movie OTT Release ) గురించి తాజాగా అప్డేట్ వస్తుంది.

"""/" / నెట్ ఫ్లిక్స్ వారు అధికారికంగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు.

ఈ సినిమా ఆగస్టు 25 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా ఓటిటిలో రిలీజ్ కాబోతుందట.తెలుగు సహా కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

చూడాలి ఓటిటిలో అయిన హిట్ అందుకుంటుందో లేదో.

మేల్ ఇన్నెర్స్ ఆర్డర్ చేస్తే.. ఫిమేల్ ఇన్నెర్స్ పంపించిన బ్లింకిట్.. చివరికి..?