ఆ గుణమే అన్నయ్యను సుగుణ సంపన్నుడిని చేసింది.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్!

నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు( Megastar Chiranjeevi Birthday ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి ఫ్యామిలీ మెంబర్స్,సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా చిరంజీవికి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

చిరు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సోదరుడు శుభాకాంక్షలు తెలిపారు.

"""/" / నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి.ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు.

ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు.అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం.

కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి.

కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు అభ్యర్ధిస్తారు.ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో అని తెలిపారు పవన్ కళ్యాణ్.

అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో రూ.ఐదు కోట్ల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు.

"""/" / ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు( Janasena ) అఖండ విజయాన్ని చేకూర్చాయి.

అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా.

తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నాను అని పవన్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అస్సలు తగ్గేదేలే.. పుష్ప 2 పై వెంకీ మామ క్రేజీ రివ్యూ… ఏమన్నారంటే?