వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ కి పవన్ కళ్యాణ్ 3వ భార్య హాజరు అవ్వడం లేదా..?అసలు ఏమి జరుగుతుంది!
TeluguStop.com
సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయి.
రెండు నెలల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఈ నెల 20 వ తారీఖున ఈ ఇద్దరి పెళ్లి ఘనంగా జరగబోతుంది.
ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నాగబాబు ( Nagababu ) ఇంట్లో రీసెంట్ గానే జరిగింది.
ఈ సెలెబ్రేషన్స్ లో చిరంజీవి ( Chiranjeevi ) తన సతీమణి సురేఖ తో పాటు వచ్చాడు.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, చిరంజీవి ఇద్దరు కూతుర్లు, అమ్మ అంజనీ దేవి గారు ఇలా అందరూ హాజరయ్యారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల రాలేకపోయాడు.
ఆయన బదులు అల్లు శిరీష్ మరియు అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ వచ్చారు.
అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 'వారాహి విజయ యాత్ర' లో ఉండడం వల్ల ఈ ఈవెంట్ లో పాల్గొనలేకపోయాడు.
"""/" /
కానీ ఆయన కుటుంబం నుండి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి వేడుకల్లో పాల్గొనలేకపోయినప్పుడు ఆయన సతీమణి అన్నా లెజినావా( Anna Lezhneva ) పాల్గొనేది.
కానీ ఈమధ్య ఆమె కనిపించడం లేదు.అధికార వైసీపీ పార్టీ నాయకులూ మరియు కార్యకర్తలు అప్పట్లో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అన్నా లెజినావా తో దూరం గా ఉంటున్నాడు అని, ఆమె చాలా రోజుల నుండి ఇండియా లో లేదని, రష్యా లో( Russia ) ఉందని అబద్ధపు ప్రచారాలు చేస్తూ వచ్చారు.
కానీ జనసేన పార్టీ( Janasena ) నుండి చాలా క్విక్ రెస్పాన్స్ వచ్చింది.
వైసీపీ ప్రచారం చేస్తున్న అసత్య వార్తలను తిప్పి కొట్టింది.కానీ ఇలా మెయిన్ ఈవెంట్స్ కి హాజరు కాకపోతే అధికార పార్టీ వారికి విమర్శలు చేసేందుకు అవకాశం కలిపించిన వాళ్ళం అవుతాము అంటూ కొంతమంది అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
"""/" /
అయితే అన్నా లెజినవా కి మొదటి నుండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం పెద్దగా ఇష్టం ఉండదట.
గతం లో కూడా నిహారిక కొణిదెల( Niharika Konidela ) పెళ్ళికి అన్నా లెజినావా హాజరు కాలేదు, అలాగే చిరంజీవి రెండవ కూతురు శ్రీజా పెళ్ళిలో కూడా అన్నా లెజినావా కనపడదు.
ఎదో ఒకటి రెండు ఈవెంట్స్ లో తప్ప, ఆమె ఎక్కువగా బయటకి రాదు.
అది ఆమె స్వభావం అట.మరి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్ళికి అయినా వస్తారో లేదో చూడాలి.
ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా స్పెయిన్ లో కేవలం కుటుంబ సభ్యులు మరియు కొంతమంది మిత్రుల సమక్షం లో మాత్రమే జరగనుంది, వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది అట.
ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!