Pawan Kalyan: వామ్మో..బ్రో ఈవెంట్ లో పవన్ ధరించిన వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రో( BRO Movie ).

ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో సాయిధరమ్ తేజ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా రేపు అనగా జూలై 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే థియేటర్ల వద్ద ఎందుకు సంబంధించిన హంగామా మొదలైంది. """/" / ఇది ఇలా ఉంటే విడుదల తేదీకి మరికొన్ని గంటల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేతికి ధరించిన వాచ్ పై ఫ్యాన్స్ దృష్టి పడింది.

వెంటనే దాని పుట్టు పూర్వోత్తరాలు వెతికి తీశారు.బ్రెగ్యుట్ మెరైన్ క్రోనోగ్రాఫ్ చేతి గడియారం ధరించారు.

"""/" / దీని ధర అక్షరాలా రూ.21,45,678.

గతంలో పవన్ వాడే గాడ్జెట్స్ గురించి పలు వార్తలు వైరల్ అయ్యాయి.ఆ లిస్ట్‌లో ఇప్పుడీ బ్రెగ్యుట్ వాచ్ కూడా చేరింది.

పవన్ ఫ్యాన్స్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.ఆ వాచ్ ధర తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

కేవలం ఒక్క వాచ్ ఖరీదు అన్ని లక్షల అంటూ నోరేళ్ల బెడుతున్నారు.ఇకపోతే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ఇద్దరు మెగా హీరోలు వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్( Varun Tej ) లు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న బ్రో సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి మరి.

నేడే దాయాదుల పోరు.. తప్పక గెలవాల్సిందే.. లేకపోతే ఇంటికే