వీరమల్లు వీరంగం ఆడాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా కొద్దిపాటి షూటింగ్ మినగా దాదాపు పూర్తయిందని తెలుస్తుంది.

సినిమాకు పవన్ కొద్దిరోజులు డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తి చేస్తారని చెబుతున్నారు.పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో పవర్ స్టార్ తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారు.

వీరమల్లు అనుకున్న దానికన్నా లేట్ అవుతున్నా బాక్సాఫీస్ పై వీరంగం ఆడటం పక్కా అని చెప్పొచ్చు.

వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. """/" / ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్ అంచనాలు పెంచింది.

పవన్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా వస్తున్న హరి హర వీరమల్లు సినిమా నేషనల్ వైడ్ గా ఆడియన్స్ కు కొత్త అనుభూతి అందించేందుకు వస్తుంది.

వీరమల్లు సినిమా తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందని అంటున్నారు.

ఈ సినిమాతో పాటుగా పవన్ మరో 3 సినిమాలు లైన్ లో పెట్టారు.

వాటిలో వినోదయ సీతం రీమేక్ కి మాత్రం 20 రోజులు డేట్స్ ఇచ్చి ఆలోగా ఫినిష్ చేయమని చెప్పాడట పవన్ కళ్యాణ్.

వైరల్ వీడియో: భర్త అంటే ఇంత ప్రేమ ఉండి, ఎందుకు విడాకులు?