రీ రిలీజ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్… ఎన్నికలలో హైప్ కోసమేనా?
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం తాను నటించాల్సిన సినిమాలు అన్నింటిని కూడా పక్కన పెట్టేసి రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ( Janasena Party ) తరపున పిఠాపురం ( Pithapuram ) నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలుపు అందుకోవాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
"""/"/
ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఈయన నటించిన వకీల్ సాబ్( Vakeel Saab ) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
2021 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
డైరెక్టర్ వేణు శ్రీరామ్ ( Director Venu Sriram )దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ పొందింది.
ఇందులో పవన్ కళ్యాణ్ వకీల్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. """/"/
ఓ రాజకీయ నాయకుడి కుమారుడి తప్పుడు కేసు కారణంగా ముగ్గురు అమ్మాయిలు జీవితం( Three Girls Life ) బలైపోతున్నటువంటి తరుణంలో ఆ కేసును వాదించి పవన్ కళ్యాణ్ వారి జీవితాలను ఎలా కాపాడారు అన్న నేపథ్యంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా తిరిగి మే ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కు మంచి మైలేజ్ క్రియేట్ చేయడానికి ఈ సినిమాని తిరిగి విడుదల చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
ప్రస్తుతం రీ రిలీజ్( Vakeel Saab Re Release ) సినిమాలకు ఆదరణ తగ్గింది అయితే ఇప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో విడుదల కాబోతున్నటువంటి వకీల్ సాబ్ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందనేది తెలియాల్సి ఉంది.
ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మారతారు!