పవన్ అంటేనే పారిపోతున్న బ్యూటీలు.. ఎందుకో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రిలీజ్‌కు రెడీ చేసిన పవన్, తన నెక్ట్స్ మూవీలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఇక వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ లాయర్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ పాత్ర పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ సినిమాలో పవన్ సరసన నటించాలంటే హీరోయిన్లు ఆమడ దూరం పారిపోతున్నారట.దీనికి కారణం ఆ పాత్రకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేకపోవడమే అని తెలుస్తోంది.

చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రను ప్రేక్షకులు గుర్తించుకోవడమే కష్టమని భావించిన హీరోయిన్లు ఈ సినిమాలో నటించేందుకు భయపడుతున్నారు.

ఇక ఈ పాత్రలో శృతి హాసన్, అనుష్క లాంటి స్టార్స్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా అవేమీ నిజం కాదని తేలిపోయింది.

మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?