వకీల్ సాబ్ లో ఆ విషయాన్ని మరీ ఎక్కువగా ఊహించుకోకండి అంటున్న దర్శకుడు
TeluguStop.com
వకీల్ సాబ్ సినిమా విడుదలకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ముఖ్యంగా సినిమా లో సెకండ్ హాఫ్ వచ్చే సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ గురించి ఎదురు చూస్తున్నారు.
భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో సెకండ్ హాఫ్ లో ఉండే సర్ ప్రైజ్ అభిమానులకు కిక్ ఇస్తుంది అంటూ సంగీత దర్శకుడు థమన్ అన్నాడు.
ఆ విషయాన్ని ఇతర యూనిట్ సభ్యులు ఎవరు కూడా పెద్దగా నోరు మెదపడం లేదు.
కాని వకీల్ సాబ్ సెకండ్ హాఫ్ లోని ఆ సర్ ప్రైజ్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పెద్ద ఎత్తు ఈ సర్ ప్రైజ్ గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యం లో దర్శకుడు వేణు శ్రీరామ్ అభిమానులను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.వకీల్ సాబ్ సినిమాలో సెకండ్ హాఫ్ సర్ ప్రైజ్ గురించి మరీ ఎక్కువగా ఊహించుకోవద్దు అన్నాడు.
ఆయన మాటలను బట్టి చూస్తుంటే థమన్ చెప్పిన రేంజ్ లో సెకండ్ హాఫ్ సర్ ప్రైజ్ ఏమీ ఉండదేమో అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ లో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ ఆశలు పెట్టుకుని సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు ఆ తర్వాత నిరాశ పడితే ఎలా అనే అనుమానాలు కూడా యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఆ అంచనాలు తగ్గించే విధంగా దర్శకుడు మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు.
సింపుల్ గానే ఉంటుంది అంటూ హింట్ ఇచ్చాడు.అయినా కూడా ఇంకా అభిమానులు ఖచ్చితంగా సర్ ప్రైజ్ ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.