'వకీల్‌ సాబ్‌' లో ఆ ఎపిసోడ్‌ లేకున్నా బాగుండేదంటున్న అభిమానులు

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆకాశమే హద్దు అన్నట్లుగా వచ్చిన అంచనాలు తగ్గట్లుగా సినిమా ఉందంటున్నారు.పింక్‌ రీమేక్ గా రూపొందిన వకీల్‌ సాబ్‌ సినిమా లో మాస్ ఆడియన్స్‌ కోసం కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసం అన్నట్లుగా ఫ్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ను పెట్టడం జరిగింది.

దాంతో సినిమా రేంజ్‌ మరింత పెరుగుతుందని అంతా భావించారు.దర్శకుడు వేణు శ్రీరామ్‌ మరియు సంగీత దర్శకుడు థమన్‌ లు ప్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లు అద్బుతంగా ఉంటాయని అంటున్నారు.

సినిమా షూటింగ్‌ సమయం నుండే ఆ ఎపిసోడ్‌ పై అంచనాలు పెంచారు.కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ను ఆ ఎపిసోడ్‌ తోనే తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

హీరోయిన్‌ శృతి హాసన్‌ పాత్రను జొప్పించి మరీ పింక్ రీమేక్ చేయడం జరిగింది.

పింక్‌ ను శృతిహాసన్‌ ను పెట్టడం వల్ల పాడు చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కాని అభిమానులకు అంచనాలు పెంచేలా దర్శకుడు వ్యాఖ్యలు చేయడంతో ఖచ్చితంగా ఆ ఎపిసోడ్‌ నభూతో అన్నట్లుగా ఉంటాయని అభిమానులు అనుకున్నారు.

నేడు సినిమా విడుదల అయ్యింది.సినిమా విడుదల తర్వాత ఆ ఎపిసోడ్‌ ను చూసిన వారు అయ్యో ఇదేంటి ఇలా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు.

సినిమా మొత్తం పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంటుంది.కాని ఫ్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ మాత్రం నిరాశ మిగిల్చింది అంటూ స్వయంగా అభిమానులు చెబుతున్నారు.

దర్శకుడు వేణు శ్రీరామ్‌ ప్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

  ఆ ఎపిసోడ్‌ తో సంబంధం లేకుండా సినిమా సూపర్‌ హిట్‌ అయ్యిందని అభిమానులు ఆనందంలో ఉన్నారు.

పవన్‌ కు చాలా కాలం తర్వాత మంచి హిట్‌ పడింది.

పుష్ప 2 తో అల్లు అర్జున్ ఆ ఘనతను సాధిస్తాడా..?