ఇప్పటికి ఇండియాస్ బిగ్గెస్ట్‌ నెం.1 మూవీ 'వకీల్ సాబ్‌'

ఈ ఏడాది కరోనా వల్ల సినిమాల విడుదల అవ్వడమే కష్టం అయ్యింది.కరోనా మొదటి వేవ్‌ కు ముందు కొన్ని సినిమాలు విడుదల అవ్వగా సెకండ్‌ వేవ్ తర్వాత అక్టోబర్ ,నవంబర్‌ నుండి సినిమాలు విడుదల అవుతున్నాయి.

బాలీవుడ్‌ లోమాత్రం సినిమాల జాతర నవంబర్‌ నుండే మొదలు అయ్యింది.ఈ ఏడాదిలో వచ్చింది కొన్ని సినిమాలే.

ఆ కొన్ని సినిమాల్లో టాప్‌ సినిమా గా వకీల్‌ సాబ్‌ నిలిచింది.ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వకీల్ సాబ్‌ ను ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్ విషయంలో బీట్‌ చేయలేదు.

ఈ ఏడాది మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది.అప్పటి వరకు వకీల్‌ సాబ్‌ ను ఎవరైనా బీట్‌ చేస్తారా అనేది చూడాలి.

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని మొదటి రోజు ఏకంగా 52.

3 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.మొదటి రోజే ఆ స్థాయి వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ మూవీ ఈ ఏడాది మరేది రాలేదు.

బాలీవుడ్‌ మూవీ సూర్య వంశీ 40 కోట్ల వరకు రాబట్టింది. """/" / అయితే రజినీకాంత్‌ అన్నాత్తే సినిమా 50 కోట్ల వరకు రాబట్టింది.

కాని వకీల్‌ సాబ్‌ ను అందుకోలేక పోయింది.మాస్టర్ సినిమా కూడా 50 కోట్ల మార్క్ ను చేరుకుంది కాని వకీల్‌ సాబ్‌ వెనుకే ఉండి పోయింది.

మొత్తానికి వకీల్‌ సాబ్‌ సినిమా ఈ ఏడాదిలో మొదటి రోజు వసూళ్ల విషయంలో నెం.

1 గా నిలిచి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.అల్లు అర్జున్‌ పుష్ప సినిమా ఈ ఏడాదిలోనే అంటే ఈ నెలలోనే రాబోతుంది.

మరి బన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న నేపథ్యంలో ఏమైనా వకీల్‌ సాబ్‌ రికార్డును బీట్‌ చేస్తాడా అనేది చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే4, శనివారం 2024