పవన్‌ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ వచ్చేది ఎప్పుడో తెలుసా?

పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న పలు సినిమా ల్లో ఉస్తాద్ భగత్‌ సింగ్ (Ustad Bhagath Singh )ఒకటి అనే విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా కోసం దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) సెట్‌ వర్క్ మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపుగా వంద కోట్లకు పైగా బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు.

భారీ ఎత్తున ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా చిత్రీకరణ యొక్క ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

వీరిద్దరి కాంబోలో గతంలో గబ్బర్‌ సింగ్‌ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు మరో విజయాన్ని వీరిద్దరు కలిసి దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా లో హీరోయిన్ గా శ్రీ లీల(Sreeleela) నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

"""/" / ఇక ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇదే ఏడాది లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీ ఎత్తున ఉస్తాద్‌ భగత్‌ సింగ్ పై ఉన్న అంచనాల నేపథ్యం లో దర్శకుడు హరీష్ శంకర్ కాస్త ఎక్కువగానే సమయాన్ని తీసుకుని స్క్రిప్ట్‌ రెడీ చేశాడు.

"""/" / గతంలో భవదీయుడు భగత్‌ సింగ్‌ అనే సినిమాను అనుకున్నారు.కానీ తాజాగా తమిళ సినిమా ను రీమేక్ చేసే ఉద్దేశ్యం తో టైటిల్ ను మార్చారు.

మొత్తానికి రీమేక్ అయినా కూడా పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.