బాలయ్య-పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.ఇటీవలే సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఇది పక్కన పెడితే బాలయ్య సినిమాలు చేస్తూనే ఒక టాకింగ్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అన్ స్టాపబుల్ షో తో బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయాడు.ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించింది.

సీజన్ 1 అనుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో పార్ట్ 2 స్టార్ట్ చేసారు.

ఆహా వారు పార్ట్ 2 ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టార్స్ ను గెస్టులుగా తీసుకు వస్తూ వారి ఫ్యాన్స్ కు ఫుల్ ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నారు.

"""/"/ మరి తాజాగా ఈ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విచ్చేయనున్నారు.

ఈయన ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే పోస్టర్స్, టీజర్ కూడా ఆహా వారు రిలీజ్ చేయగా వాటికీ అదిరిపోయే స్పందన కూడా వచ్చింది.

మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. """/"/ ఇటీవలే బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కు రాగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను కూడా సెన్సేషనల్ గా ప్లాన్ చేసినట్టు టాక్.

ఇప్పటికే భారీ హైప్ తెచ్చుకున్న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ సెట్ గురించి సమాచారం బయటకు వచ్చింది.

పవన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది.

మరి అధికారిక క్లారిటీ అనేది రావాల్సి ఉంది.