Pawan Kalyan: పాకెట్ మనీ కోసం వారి దగ్గర డబ్బు తీసుకున్న పవన్.. నేడు రోజుకు రెండు కోట్ల సంపాదన..ఇది కదా సక్సెస్?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకరు.

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన నటన ద్వారా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి పవన్ కళ్యాణ్ అనంతరం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి కూడా వచ్చారు.

ఇలా ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాలలో కొనసాగుతూ బిజీగా ఉన్నారు.ఇక పవన్ కళ్యాణ్ చేసినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను రోజుకు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటానని తెలిపారు.

ఇలా తాను ఒక రోజు సినిమా షూటింగ్ కి హాజరైతే రెండు కోట్ల రెమ్యూనరేషన్( Two Crore Remuneration ) తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు.

ఇప్పుడు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖర్చుకు డబ్బులు లేక రామ్ చరణ్( Ram Charan ) దగ్గర వారు దాచుకున్నటువంటి డబ్బును పాకెట్ మనీ కోసం తీసుకున్నాను అంటూ ఓ సందర్భంలో ఈయన చెప్పటం గమనార్హం.

"""/" / సినిమాలలోకి రాకముందు తన వద్ద డబ్బులు కూడా ఉండేవి కాదని తెలియజేశారు.

ఎవరిని అడగాలో దిక్కు తెలియదు వదినని అడిగితే ఏమనుకుంటుందో అనే ఫీలింగ్ ఉండేది ఇలా డబ్బులు ఎవరిని అడగాలో కూడా తెలిసేది కాదు కానీ చరణ్ (Charan) వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండేవి.

పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బులను దాచుకునేవారు.ఇలా వీరికి వడ్డీ ఇస్తానని చెప్పి వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

"""/" / ఇక ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చరణ్ మేము కూడా వడ్డీ ఇస్తారు కదా బాబాయ్ అని చెప్పి అన్ని దాచుకొని తనకు ఇచ్చే వాళ్ళం అని తెలిపారు.

ఇలా వాళ్ల దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటే తిరిగి మరి నన్ను బాబాయ్ మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటూ కూడా నన్ను అడిగేవారని పవన్ తెలిపారు.

ఇలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తన వద్ద కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారనే విషయాలను తెలియజేశారు.

"""/" / ఇలా ఒకప్పుడు ఇబ్బందులు పడినటువంటి ఈయన ఇప్పుడు ఒక రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అంటే ఇది నిజమైన సక్సెస్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరియర్ విషయానికి వస్తే ఒకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈయన చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపు సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు.

భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య.. వచ్చిన రూ.10 లక్షలు తీసుకుని ప్రియుడితో జంప్..!