పవన్ కూడా అదే దారిలో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన కమ్ బ్యాక్ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్‌.

ఈ సినిమా తరువాత పవన్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో పవన్ చేయబోయే పాత్రపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తుండగా, అందులో పండుగ సాయన్న పాత్ర చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

తెలంగాణలో నిజాం పాలనను వ్యతిరేకించిన పండుగ సాయన్న, నిజాం వ్యవస్థను వ్యతిరేకించి తిరుగుబాటుదారుడిగా పాలకుల వెన్నులో వణుకు పుట్టించాడు.

ఈ పాత్ర చాలా సామాజిక స్పృహ కలిగి ఉంటుందని, దాన్ని పవన్ తప్ప మరెవరూ చేయలేరని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా స్ఫూర్తితోనే పవన్ కోసం ఇలాంటి పాత్రను తెరకెక్కించేందకు దర్శకుడు క్రిష్ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తుండగా ఈ చిత్ర షూటింగ్‌ను ఈ నెలలో అఫీషియల్‌గా ప్రారంభించనున్నారు.

మరి ఈ సినిమాలో పవన్ నిజంగానే తెలంగాణ రాబిన్‌హుడ్‌గా కనిపిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకే .. ఆ యువ ఎంపీ వైపు  బాబు మొగ్గు ?