గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అంచనాలను పెంచేస్తారా?
TeluguStop.com
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన గేమ్ చేంజర్( Game Changer ) మూవీ విడుదల కావడానికి మరికొన్ని రోజులు సమయం ఉంది.
దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గేమ్ చేంజర్ సినిమా మేనియానే కనిపిస్తోంది.
ఒకవైపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ ఆ అంచనాలు కాస్త భారీగా పెంచేస్తున్నారు మూవీ మేకర్స్.
సోషల్ మీడియాలో హంగామా అన్ని కోణాల నుంచి సినిమా ప్రమోషన్ ను పరుగులుపెట్టిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.
"""/" /
రోజురోజుకీ ఈ సినిమాపై ఉన్న ఎక్సపెక్టేషన్స్ ని భారీగా పెంచేస్తున్నారు దిల్ రాజు.
( Dil Raju ) అయితే ఇంత ప్రచారం నడుస్తున్నప్పటికీ, ఒక చిన్న క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.
అదే పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఎంట్రీ.గేమ్ ఛేంజర్ ప్రచారానికి పవన్ వస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ఇలాంటి టైమ్ లో గేమ్ ఛేంజర్ ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
పవన్ వస్తే ఈ సినిమాకు వచ్చే బజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
"""/" /
అయితే ఎట్టకేలకు దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
పవన్ కోసం తాము కూడా వెయిట్ చేస్తున్నట్టు వెల్లడించాడు.పవన్ కల్యాణ్ డేట్ ఇస్తే, జనవరి 4 లేదా 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఈవెంట్ నిర్వహిస్తామని చెబుతున్నారు దిల్ రాజు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విజయవాడలో భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేశారు.
ఇక పవన్ కూడా డేట్ ఇస్తే, సినిమా ప్రచారం పీక్స్ కు చేరినట్టే అని చెప్పాలి.
ఈ సినిమా ప్రచారానికి బాబాయ్ ను రప్పించేందుకు, రామ్ చరణ్ స్వయంగా ప్రయత్నిస్తున్నాడు.
పవన్ రావడం ఖాయం.డేట్ తేలడమే తరువాయి.
ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!