కుల‌, మ‌తాల గురించి ఆలోచించ‌నుః ప‌వ‌న్ క‌ల్యాణ్

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొంత‌వ‌ర‌కైనా అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

జ‌న‌సేన ప్రారంభించిన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు.

జిల్లాలోని సిద్ధవ‌టం మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ‌లో పాల్గొన్నారు.అనంత‌రం ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ 173 మంది కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.

ల‌క్ష చొప్పున రూ.1.

73 కోట్ల‌ను అంద‌జేశారు.2014లో మార్పు కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌న్నారు.

ప‌ద‌వీ, అధికారం కోసం పార్టీ పెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.త‌న పోరాటం వ్య‌క్తుల‌పై కాద‌ని, భావాల‌పైనే పోరాటం చేస్తాన‌ని పేర్కొన్నారు.

అదేవిధంగా కుల‌, మ‌తాల గురించి ఆలోచించన‌ని చెప్పారు.అలా కుల మాతాల‌పై రాజ‌కీయాలు చేస్తే దేశం చిన్నాభిన్నం అవుతుంద‌న్నారు.

ఇడ్లీ, సాంబార్ ట్రై చేసిన రష్యన్ యువతి.. ఆమె రియాక్షన్ ఇదే..?