పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’ సినిమా ఆరోజుల్లో అంత వసూళ్లు రాబట్టిందా..!

నటుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని( Pawan Kalyan ) అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన సినిమాలలో ఒకటి 'సుస్వాగతం'.

( Suswagatam Movie ) ఇందులో పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపం ని చూపించింది.

ముఖ్యంగా తన తండ్రి పాత్ర పోషించిన రఘువరన్ తో సన్నివేశాలు అద్భుతంగా పండాయి.

వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలను చూస్తే మన నాన్న తో గడిపిన సరదా సంఘటనలు గుర్తుకు వస్తాయి.

ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కన్నీళ్లు రప్పించేస్తాడు.ప్రేయసి కోసం సర్వస్వము పోగొట్టుకొని చివరికి ఒంటరి వాడిగా మిగిలిపోవడం ప్రతీ ఒక్కరి హృదయాలను కలిచివేస్తుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ తన తండ్రి చనిపోయినప్పుడు పడే బాధ చూస్తే ఎలా వాడికైనా కన్నీళ్లు రాక తప్పదు.

అంత అద్భుతంగా నటించాడు ఆయన.మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ నటనని ఆయన కూడా మ్యాచ్ చెయ్యలేకపోయాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

"""/" / ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆరోజుల్లో మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

ఆరోజుల్లోనే ఈ సినిమా 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్ 'గోకులం లో సీత' ( Gokulamlo Seeta ) మరియు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'( Akkada Ammai Ikkad Abbai ) సినిమాలు మాత్రమే చేసాడు.

ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడాయి.

ఇక సుస్వాగతం సినిమాలోని పాటలు ఇప్పటికీ ఫేమస్ అనే చెప్పాలి.'ఏ స్వప్న లోకాన సౌందర్యా రాసి', 'సుస్వాగతం' , 'హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు ' వంటి పాటలు ఆరోజుల్లో యువత ని ఒక ఊపు ఊపేసాయి.

ఇక క్లైమాక్స్ లో తండ్రి చనిపోయిన తర్వాత 'ఆలయాన హారతి లో.ఆఖరి చితి మంటలలో' అనే పాట ప్రేక్షకుల హృదయాలను పిండేస్తుంది.

"""/" / పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన 'సుస్వాగతం' సినిమాని త్వరలోనే 4K క్వాలిటీ కి మార్చి రీ రిలీజ్ చెయ్యబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది.

ఇదే కనుక నిజమైతే మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యి సునామి లాంటి వసూళ్లు సృష్టించబోతోంది అని చెప్పొచ్చు.

ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలలో తొలిప్రేమ , జల్సా మరియు ఖుషి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి.

ఇప్పుడు 'సుస్వాగతం' చిత్రం కూడా అదే రేంజ్ లో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

మెరూన్ రంగు లో డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్నకృతి శెట్టి ..