పవన్ కోసం అలాంటి హీరోయిన్‌ను వెతుకుతోన్న సురేందర్ రెడ్డి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాతో రెండేళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తోన్న పవన్, అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండంతో, వకీల్ సాబ్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఎవ్వరి ఊహలకు అందకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు పవన్ రెడీ అయ్యాడు.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్‌తో ఇప్పటివరకు నటించని హీరోయిన్‌ను తీసుకోవాలని దర్శకుడు సురేందర్ రెడ్డి చూస్తున్నాడు.

ఈ మేరకు హీరోయిన్ వేటలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.ఇక అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడని, ఈ మేరకు చిత్ర యూనిట్‌కు సూచించాడట.

ఇక ఈ సినిమాను నాన్-స్టాప్‌గా షూటింగ్ చేసి పూర్తి చేయాలని చిత్ర యూనిట్భావిస్తోందట.

మరి ఈ సినిమాలో పవన్ సరసన నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

ఏపీ ఎన్నికల నిర్వహణలో పోలీసులు ఫెయిల్ ..: మంత్రి అంబటి