‘ఓజి’ ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్ లాక్.. అఫిషియల్ అనౌన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ''ఓజి''.

ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.పవన్ కూడా అన్నిటికంటే లాస్ట్ ప్రకటించిన ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందు పూర్తి చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూట్ పూర్తి చేసుకుంది. """/" / పవన్ వారాహి యాత్ర( Varahi Yatra )లో బిజీగా ఉన్నప్పటికీ ఓజి సినిమా మాత్రం ఆగలేదు.

ఈయన లేని పోర్షన్ ను పూర్తి చేసారు.ఇక ప్రజెంట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అయ్యాడు.

దీంతో శరవేగంగా షూట్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుండడంతో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్.

ఇదిలా ఉండగా రోజురోజుకూ అంచనాలు పెరుగుతుండగా మరింత హై లెవల్ కు చేరుకుంది.

రానున్న రోజుల్లో వరుస అప్డేట్ లతో మరింత హై కు చేరుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ రివీల్ చేసారు.

ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్( Overseas Distributors ) గురించి తాజాగా మేకర్స్ ఒక పోస్ట్ చేసారు.

యూఎస్ లో ఈ సినిమా ఎవరు రిలీజ్ చేయబోతున్నారు అనేది తెలిపారు. """/" / ఈ సినిమాను ప్రముఖ డిస్టిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఇంకా డబుల్ ఏ క్రియేషన్స్ ( AA Creations )వారు సంయుక్తంగా యూఎస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

మరి యూఎస్ లో గ్రాండ్ రిలీజ్ ఓజి సినిమాకు దక్కుతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?