అనారోగ్యానికి గురైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… ఏమైందంటే?

సినీ నటుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది.

సినీ నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ బాధ్యతలను తీసుకున్నారు ఈయన ఉపముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ఇతర శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మొత్తం వరదలలో( Floods ) చిక్కుకుంది.

దీంతో పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను సురక్షితంగా కాపాడాలని వారికి నిత్యావసరాలను అందించాలంటూ ఆదేశాలను జారీ చేస్తున్నారు.

"""/" / ఇలా నిత్యం పంచాయతీ రాజ్ అలాగే ఇతర శాఖలకు చెందిన అధికారులతో ఈయన సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు.

ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చిన నేపథ్యంలో వర్షాలతో గ్రామాల్లో అధ్వానంగా మారిన పరిస్థితులపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇలా నిత్యం ఎంతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది.

ఇంట్లోనే కాసేపు విశ్రాంతి తీసుకుంటూనే మరోవైపు వరద సహాయక చర్యల నిమిత్తం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

"""/" / మంగళవారం నుంచి అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్ నేడు మరింత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

ఈయన తీవ్రమైన దగ్గు జలుబు వైరల్ ఫీవర్( Viral Fever ) కి గురయ్యారని సమాచారం.

ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు రాష్ట్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా అనారోగ్యానికి గురయ్యారని ఇప్పుడిప్పుడే మెల్లి మెల్లిగా అందరూ కోరుకుంటున్నారని సమాచారం.

నా ప్రాణాలకు రక్షణ కల్పించండి.. కెనడా పోలీసులకు హిందూ ఆలయ అధిపతి లేఖ