Pawan Kalyan : పిఠాపురం మొదటి రోజు ప్రచారంలో పవన్ కి కష్టాలు..!!

pawan kalyan : పిఠాపురం మొదటి రోజు ప్రచారంలో పవన్ కి కష్టాలు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) శనివారం మార్చి 30వ తారీఖు నుండి పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి( Election Campaign In Pithapuram ) రెడీ కావడం తెలిసిందే.

pawan kalyan : పిఠాపురం మొదటి రోజు ప్రచారంలో పవన్ కి కష్టాలు!!

2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.దీంతో ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

pawan kalyan : పిఠాపురం మొదటి రోజు ప్రచారంలో పవన్ కి కష్టాలు!!

అయితే శనివారం ఉదయమే ప్రత్యేక హెలికాప్టర్ లో పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక దత్తపీఠంలోని( Dattapeetam ) పూరూహుతిక అమ్మవారి దర్శనం.

వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. """/" / కానీ మధ్యాహ్నం అమ్మవారి ఆలయం మూసి ఉండటంతో ఈ కార్యక్రమం కాస్త సాయంత్రానికి వాయిదా పడింది.

సాయంత్రం నాలుగు గంటల తర్వాత వారాహి వాహనంతో అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం కాగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది.

విషయంలోకి వెళ్తే వారాహి వాహనంపై ( Varahi Vehicle )సాయంత్రం పిఠాపురంలో నిర్వహించే సభకు అనుమతి లేదని పోలీసులు.

పవన్ కళ్యాణ్ కి తేల్చి చెప్పారు.ముందుగా అనుమతులు తీసుకోకపోవడంతో.

నేడు వారాహి పై సభకు అనుమతి లేదని పేర్కొన్నారు.ఈ పరిణామంతో చిన్న వాహనంపైనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తొలి ఎన్నికల సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ పరిణామం పై జనసైనికులు మండిపడుతున్నారు.అడుగడుగునా ఆటంకాలు సృష్టించటం తగదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.అయితే వారాహి వాహనానికి సంబంధించి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకోవడంలో జనసేన అగ్రనాయకత్వం అలసత్వం ప్రదర్శించిందట.

దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి అవసరమని స్థానిక పోలీసులు చెప్పటంతో.పిఠాపురం మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కి కష్టాలు ఎదురయ్యాయి.

ముంబై వడా పావ్‌కు ఫిదా అయిన ఫారిన్ వ్లాగర్.. మరాఠీ మాట్లాడి ఆకట్టుకుందిగా!