భార్యతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు ఫోటో రిలీజ్..!!
TeluguStop.com
గత కొద్ది రోజుల నుండి వెబ్ మీడియాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఆయన భార్య అన్నా లెజినోవాకి మనస్పర్ధలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఆమె ఇండియా వదిలి రష్యా కూడా వెళ్ళిపోయినట్లు కొన్ని కథనాలు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇటువంటి తరుణంలో జనసేన పార్టీ సోషల్ మీడియా వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడేలా పవన్ కళ్యాణ్ తో అన్నా హైదరాబాదులో చేస్తున్న ప్రత్యేక పూజలు ఫోటో రిలీజ్ చేయడం జరిగింది.
అంతేకాదు వారాహి విజయ యాత్ర తొలిదశ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో ఈ పూజ నిర్వహించినట్లు జనసేన పార్టీ( Jana Sena Party ) అధికారిక సోషల్ మీడియా ఫోటోతో పాటు పోస్ట్ చేయడం జరిగింది.
"""/" /
ఆ పోస్టులో ఏముందంటే "జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు.
కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది.ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు" అని జనసేన పార్టీ సోషల్ మీడియా ( Social Media )ద్వారా తెలియజేయడం జరిగింది.
తాజా పోస్ట్ తో పవన్ కళ్యాణ్.అనా విడిపోయినట్లు వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!