పవన్ కళ్యాణ్ – సౌందర్య కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా అదేనా..? చేసుంటే ఎంత బాగుండేదో!
TeluguStop.com
కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఊహించుకోవడానికే.ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు.
కానీ కొన్ని కాంబినేషన్స్ చేతుల దాకా వచ్చి చేజారిపోతుంది,అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ - సౌందర్య( Soundarya ) కాంబినేషన్.
పవన్ కళ్యాణ్ చిరంజీవి ( Chiranjeevi )తమ్ముడిగా చలామణి అవుతున్న రోజులవి.ఆయనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఏర్పడలేదు.
అప్పుడే కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చిన అబ్బాయి, కేవలం 'అక్కడ అమ్మాయి.ఇక్కడ అబ్బాయి'( Akkada Ammayi Ikkada Abbayi ) మరియు 'గోకులం లో సీత' సినిమాలు మాత్రమే చేసి ఉన్నాడు.
ఆయన మూడవ చిత్రం 'సుస్వాగతం'.హీరో గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కి తగిలిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇది.
ఇందులో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన ప్రతీ ఒక్కరి హృదయాల్ని కలిచివేస్తాది.అంత ఎమోషనల్ గా ఈ సినిమాలో ఆయన నటించాడు.
ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ నటన ని ఎప్పటికీ మర్చిపోలేం. """/" /
ఈ సినిమాలో హీరోయిన్ గా దేవయాని నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఆమె కంటే ముందుగా ఈ చిత్రం లో హీరోయిన్ గా సౌందర్య ని తీసుకుందాం అనుకున్నారట.
కానీ అందుకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒప్పుకోలేదట.అంత పెద్ద నటితో నటించేంత ధైర్యం నాకు లేదని , ఆమె నటన ముందు నా నటన తేలిపోతుందని, ఆమెకు బదులుగా వేరే ఎవరినైనా తీసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసాడట.
కానీ డైరెక్టర్ భీమినేని శ్రీనివాస రావు మాత్రం తగ్గలేదు.ఇలాంటి పాత్రలు కేవలం సౌందర్య మాత్రమే చేయగలదని, ఆమె వల్ల సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని పట్టుబట్టాడట.
ఇక డైరెక్టర్ అంతలా చెప్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడట.అయితే కొన్ని రోజుల తర్వాత సౌందర్య ని కలిసి డేట్స్ కావాలని అడగగా ఆమె అందుబాటులో లేవని చెప్పిందట.
"""/" /
దీంతో ఆమె తర్వాత అదే తరహా హోమ్లీ ఇమేజి ఉన్న తమిళ స్టార్ హీరోయిన్ దేవయాని ని తీసుకొని ఈ సినిమాని చేసారు.
అప్పట్లో దుమ్ము లేచిపోయే వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు.ఇప్పటికీ అభిమానులకు ఈ సినిమా అంటే ఎంతో ఇష్టం, ముఖ్యంగా పతాక సన్నివేశానికి ముందు పవన్ కళ్యాణ్ తండ్రి రఘువరన్ చనిపోయినప్పుడు వచ్చే 'ఆలయాన హారతి లో.
ఆఖరి చితిమంటలలో' అంటూ సాగే పాటని ఇప్పుడు చూసిన ఏడ్చేస్తాము.
నాగచైతన్యకు ఆ స్టార్ హీరో అభిమానుల సపోర్ట్.. తండేల్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా!