సమంత కొండా సురేఖ ఇష్యూ.. స్పందించని ఏపీ డిప్యూటీ సీఎం పవన్?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) సమంత గురించి చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఈ వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పట్టారు.

కొండా సురేఖ తన రాజకీయాల కోసం ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం ఏమాత్రం సభ్యత కాదని ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఆమె ఇలా మాట్లాడటం తప్పు అంటూ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఇలా సమంత( Samantha )నాగచైతన్య( Nagachaitan ) అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

"""/" / ఇక నాగార్జున( Nagarjuna ) సైతం తన ఫ్యామిలీ గురించి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడటమే కాకుండా తనపై పరువు నష్టం దావా కూడా వేశారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లు ఇతర ఆర్టిస్టులు డైరెక్టర్లు కూడా ఈ విషయంపై స్పందించారు కానీ ఇప్పటివరకు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.

పవన్ కళ్యాణ్ సమంత కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించారు. """/" / సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తనకు గురువు లాంటి వారు అంటూ సమంత కూడా పలు సందర్భాలలో తెలిపారు.

అలాంటిది సమంత గురించి మంత్రి అలా మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు.

దీంతో పలువురు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించకపోవడానికి కారణం ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడటమే అని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు దీక్ష పూర్తి చేసి ఇటీవళ తిరుమలకు మెట్ల మార్గం గుండా వెళ్లిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన తీవ్రమైన జ్వరం కారణంగా ఇబ్బంది పడుతున్నారని బహుశా అందుకే ఈ విషయం గురించి మాట్లాడలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…