జనసేనను పవన్ సెట్ చేస్తారా ? 

జనసేనను పవన్ సెట్ చేస్తారా ? 

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీ పరిస్థితి చూస్తుంటే,  రాబోయే ఎన్నికల్లో ఎదురీత తప్పదనే విధంగా పరిస్థితి నెలకొంది.

జనసేనను పవన్ సెట్ చేస్తారా ? 

జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, వ్యతిరేకత అయితే బాగా పెరుగుతూ వస్తోంది.

జనసేనను పవన్ సెట్ చేస్తారా ? 

  దీంతో టీడీపీ , జనసేన వంటి పార్టీలకు 2024 ఎన్నికల పై ఆశలు పెరిగాయి.

తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే మెరుగైన ఫలితాలు దక్కుతాయని రెండు పార్టీలు ఆశాభావంతో నే ఉన్నాయి.

ఈ మేరకు పొత్తుల వ్యవహారం లో ముందడుగు వేస్తోంది.  రాజకీయంగా జనసేనను యాక్టిివ్ చేసే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై జనసేన పోరాడుతోంది.అంతేకాదు ఏపీ అధికార పార్టీ వైసీపీ ని మరింత గా డ్యామేజ్ చేసే విధంగా జనసేన ప్రస్తుతం వ్యవహారాలు చేస్తోంది .

అయితే జనసేనను రాజకీయంగా బలోపేతం చేసే విషయంలో పవన్ అంతగా శ్రద్ధ పెడుతున్నట్లుగా కనిపించడం లేదు.

175 నియోజకవర్గాల్లో జనసేన కు బలమైన నాయకులు గానీ , ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అంత స్థాయి కలిగిన నాయకులు గానీ ప్రస్తుతం కనిపించడం లేదు.

  పవన్ అభిమానులు , జనసేన కార్యకర్తల బలం ఉన్న,  ఎన్నికల్లో అది ఏమాత్రం సరిపోదు.

  ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి,  రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను బలంగా ఢీ కొట్టగల స్థాయి ఉన్న నాయకులు ప్రస్తుతం కనిపించడం లేదు.

నియోజకవర్గానికి కనీసం ఒకరిద్దరు బలమైన నేతలను ఇప్పటి నుంచి గుర్తించి, వారే అభ్యర్థులకు సంకేతాలు ఇచ్చి ఉంటే పరిస్థితి ఎన్నికలనాటికి వేరేగా ఉంటుంది.

కానీ పవన్ ఆ విధంగానూ చేయలేకపోతున్నారు.నియోజకవర్గంలో జనసేన ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి, ఎన్నికల్లో గెలిచే అంతటి సామర్థ్యం సంపాదించుకునే అవకాశం జనసేన నాయకులకు లేకుండా పోయింది.

"""/" / ఇప్పటి నుంచే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే ఫలితం వేరుగా ఉంటుంది.

  అయితే పవన్ మాత్రం ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తే ఎన్నికల సమయం నాటికి వారి వ్యవహారాలు కారణంగా వివాదాస్పదం అవుతారని , అప్పుడు మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.

టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న, ఒంటరిగా ఉన్న జనసేన ను బలోపేతం చేస్తే తప్ప పార్టీ క్యాడర్ లో ఉత్సాహం వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

ఆ మాటలు విని కన్నీరు పెట్టుకున్న సీఎం! వీడియో వైరల్