అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించా.. పవన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉండగా ఆ అభిమానులలో చాలామంది పవన్ రాజకీయాల్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.
ఎప్పటికైనా తమ ఫేవరెట్ యాక్టర్ సీఎం కావాలని అభిమానులు భావిస్తున్నారు.పవన్ సైతం ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలను ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
పవన్ తాజాగా అనంతపురంలో మాట్లాడుతూ నేను అద్భుతాలు చేస్తానని చెప్పనని పవన్ అన్నారు.
ఆత్మహత్య చేసుకోవాలని ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తారో తనకు తెలుసని పవన్ కామెంట్లు చేశారు.
ఒకప్పుడు నేను ఇంటర్ చదివే సమయంలో సరిగ్గా చదువుకోవట్లేదు అని బాధతో ఆత్మహత్య చేసుకుంటే మంచిదని ఆలోచించానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
కానీ అదృష్టం కొద్దీ నా సోదరుడు నాగబాబు, వదిన పక్కన ఉండి మంచి మాటలు చెప్పి నన్ను కాపాడారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాను మానవత్వంతో సహాయం చేస్తున్నానే తప్ప ఓట్ల గురించి ఆలోచించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
"""/" / 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే అయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా కోసం పూర్తిస్థాయిలో డేట్స్ ను కేటాయించారు.
"""/" /
హరిహర వీరమల్లు పూర్తైన తర్వాతే పవన్ తర్వాత సినిమాలకు డేట్స్ కేటాయించనున్నారు.
ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా పవన్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ ఏడాదే పవన్ నటించిన హరిహర వీరమల్లు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ప్రమోషన్స్ విషయంలో బన్నీకి బన్నీనే సాటి.. మిగతా హీరోలు ఈ విషయంలో మారతారా?