బ్రో మూవీ మేకర్స్ కు అలా షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ విషయంలో నిరాశేనా?
TeluguStop.com
పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్( Pawan Kalyan-Sai Dharam Tej ) లో తెరకెక్కుతున్న బ్రో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా టీజర్ అతి త్వరలో రిలీజ్ కానుంది.
వేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా మేకర్స్ అతి త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కు మాత్రం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
"""/"/
పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కు హాజరై ఉంటే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగి ఉండేవి.
బ్రో సినిమా( Bro Movie ) ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.ఈ సినిమా వినోదాయ సిత్తం రీమేక్ అయినా ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు సైతం నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
బ్రో సినిమా బడ్జెట్ 120 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 180 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.
బ్రో మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బ్రో మూవీలో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తోంది.
బ్రో మూవీ ప్రమోషన్స్ కు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం పవన్ హాజరవుతారని తెలుస్తోంది.
పవన్ హాజరు కాకపోయినా సాయితేజ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.
"""/"/
సాయితేజ్ విరూపాక్ష సినిమా( Virupaksha ) తర్వాత ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
బ్రో మూవీ 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.
బ్రో మూవీ పవన్, సాయితేజ్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లు ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.
రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!