ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) శనివారం కాకినాడ రూరల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై.

సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.కన్నబాబుతో తనకు ప్రత్యేకమైన సంబంధం ఉందని వ్యాఖ్యానించారు.

ప్రజారాజ్యం పార్టీ ( Praja Rajyam Party ) పెట్టిన తొలినాళ్లలో కన్నబాబుకి ఒక డొక్కు స్కూటర్ ఉండేది.

దానిమీద తిరుగుతుండేవాడు.కన్నబాబు ఇలా.

రా.అంటే పరిగెత్తుకుని వచ్చేవాడు.

చిరంజీవి గారికి ఏదైనా చిన్న సమాచారం కావాలంటే ఇచ్చే వ్యక్తి.అంచలంచలుగా నాయకుడిగా ఎదిగాడు.

నాయకులుగా ఎదగటాన్ని మేము వ్యతిరేకించం.మేమేమీ అభ్యంతరం పెట్టడం.

"""/" / ఎమ్మెల్యే కన్నబాబు( MLA Kannababu ) వెయ్యి కోట్లు సంపాదించాడు.

స్థలాలు దోచేశారు.ప్రతి విషయంలో కమిషన్ అంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.పార్టీలో నేను వ్యవస్థాపక సభ్యుడిని.

కానీ పార్టీని కాంగ్రెస్ ( Congress )లో విలీనం చేయటానికి మూలకారకుడు ఈ కురసాల కన్నబాబే.

అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో కాకినాడ ప్రాంతంలో శెట్టిబలిజలు, మత్స్యకారుల సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి.

నేను అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తాను.కులం ఆధారం చేసుకుని రాజకీయాలు చేయను.

నేను ఒక కులానికే చెంది రాజకీయాలు చేస్తే ఆ కుల నాయకుడు అవుతాను.

కానీ నేను ఒక పార్టీకి అధినేతను.రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిని అంటూ.

పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ ఇచ్చారు.

పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే.. కుంభస్థలం బద్దలుగొడతారా?