ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్లు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి పగ పట్టినట్లు పరిస్థితి మారిపోయింది.వరుసపెట్టి తుఫాన్లు రావడంతో.

వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఇటీవల ఏర్పడిన అల్పపీడనం.

వాయుగుండంగా మారిన టంతో దక్షిణ కోస్తాలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు.

నదులు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే.ఏకంగా ప్రజలు ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరటంతో.

అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో.

కురిసిన వర్షాలకు భవనాలు కూడా నీళ్ళల్లో కొట్టుకు వెళ్లిపోయిన పరిస్థితి.ఇదే సమయంలో పొలాలు కూడా మునిగిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటువంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

విషయంలోకి వెళితే ఇటీవల కడప జిల్లాలో జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పర్యటించారు.

ఈ సందర్భంగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

పవన్ ఈ ఈ విధంగా సోషల్ మీడియాలో స్పందించారు."జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది.

కూలిన ఇళ్ళు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి.అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయి.

ఆ గ్రామాల్లో విద్యుత్ ఇప్పటికీ పునరుద్ధించలేదు.చీకట్లో బతుకుతున్నారు.

గూడు కోల్పోయి నిరాశ్రయంగా ఉన్నారు.ఆ బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు? పార్టీ పి.

ఏ.సి.

ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

నిత్యావసరాలు, పాత్రలు, దుప్పట్లు ఇచ్చారు.అంటూ కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో నాదెండ్ల మనోహర్ పర్యటించిన ఫోటోలను పోస్ట్ చేశారు.

Gulab Jamun Noodles : ఇదెక్కడి విచిత్రమైన ఫుడ్ కాంబో.. నూడుల్స్‌లో గులాబ్ జామున్‌..!