విశాఖ సౌత్ వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురువారం విశాఖ సౌత్ లో వారాహి విజయభేరి సభ( Varahi Vijayabheri Sabha ) నిర్వహించారు.

ఈ సభలో పవన్ మాట్లాడుతూ.తన సినిమా కెరియర్ విశాఖ నుండి ప్రారంభమైందని తెలిపారు.

ఉత్తరాంధ్ర ఆటపాట తనకెంతో ఇష్టమని.ఆ పాటలలో ప్రజల ఆవేదన అర్థం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వం 30 వేలమంది అమ్మాయిలు అదృశ్యమైతే.పట్టించుకోకుండా సొంత చెల్లి జీవితాన్ని బయటికి లాగిన దిగజారుడు వ్యక్తి అంటూ సీఎం జగన్ ( CM Jagan )పై విమర్శలు చేశారు.

సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాడు.ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడా.

? భార్య పిల్లలను కిడ్నాప్ చేస్తే వాళ్ళ సొంత ఎంపీని రక్షించుకోలేకపోయాడు.సొంత కుటుంబాలని రక్షించుకోలేని వారు.

మన జీవితాలకు ఏం భద్రత ఇస్తారు. """/" / రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు.

ప్రజలు నమ్మకంతో ఓటేస్తారు.ఈ ముఖ్యమంత్రి వేలు చూపించి సిద్ధం.

సిద్ధం అంటున్నాడు.దేనికయ్య సిద్ధం నువ్వు.

? మేం కూడా సిద్ధం.ఓటేసి కిందకు తొక్కడానికి మేము సిద్ధం.

నువ్వు వేలు చూపించి ఎవడిని బెదిరిస్తున్నావు.? నేను సినిమాల్లో వేలు చూపించే ఫోటోలకు ఫోజులివ్వడానికే.

ఆలోచిస్తాను.అలాంటిది ఈ నా సిద్ధమంటే మనం భయపడి పోతాం అనుకుంటున్నాడు.

నేను అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చాను.నేను ప్రాణాలను కూడా లెక్క చేయకుండా.

ఈ ఫ్యాక్షన్ ముకాలను ఎదుర్కొంటున్నాను.అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో తనని నోవోటల్ హోటల్ లో నిర్బంధించినప్పుడు యావత్ విశాఖ మొత్తం తరలి వచ్చిందని అండగా నిలిచిందని పేర్కొన్నారు.

ఒక మహిళా తన నాలుగేళ్ల బిడ్డను చంకనెత్తుకొని వచ్చిందని.దోమలు కుడుతున్నా.

నాకోసం అండగా నిలబడటం నన్నెంతగానో కదిలించింది.ఆమె నాకోసం మాత్రమే కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు.

వీడియో: పందిని చంపేద్దాం అనుకున్న చిరుతపులి.. ఊహించని షాక్‌తో తల్లడిల్లింది..?