సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించిన పవన్!
TeluguStop.com
టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) టార్గెట్ చేశారా అంటే అవుననే తెలుస్తుంది.
ఇందులో భాగంగానే సినిమా సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుంది.అయితే ఇటీవల అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు సినిమాలకు బెనిఫిట్ షో లు ఉండవని అలాగే అదనపు టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదని ఈయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతున్నాయి.
ఇలా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా మరికొందరు పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు.
"""/" /
ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా( AP Deputy CM ) కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఏపీలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాల్లో( Tribal Villages ) పర్యటన చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.గిరిజన ప్రాంతాలలో చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని తెలంగాణలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ ఏపీకి వచ్చి ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుపుకోవాలని తెలిపారు.
"""/" /
విదేశాలలో ఉండే అందమైన ప్రదేశాలు ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్నాయని ఇక్కడికి వచ్చి సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటే కనుక గిరిజనలకు ఉపాధి కలుగుతుందని పవన్ తెలిపారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తెలంగాణ ప్రభుత్వం సినిమాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం పై ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది ఇక్కడ కూడా సినిమాలకు బెనిఫిట్ షోలను రద్దు చేస్తారా టికెట్ల రేట్లు కూడా తగ్గిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, ఆదివారం 2024