ముఖ్యమంత్రి పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి యాత్ర( Varahi Yatra ) ప్రారంభమైంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో తొలి బహిరంగ సభలో వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.

గత ఎన్నికలలో అసెంబ్లీ లోకి అడుగుపెట్టకుండా కక్షగట్టి ఓడించారు.కానీ ఈసారి జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాను.

తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.జనసేన ( Janasena ) దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

"""/" / పవన్ మాట్లాడుతూ ఎంతసేపు.నువ్వు ఒంటరిగా రా.

విడిగా పోటీ చెయ్ అంటారు.నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఆ సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను.కానీ ఒక్క విషయం వచ్చే ఎన్నికల్లో గెలిచి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే.

దానికోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తాం.ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం.

ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి.? ఎలా వెళ్లాలి ? అనేది మాట్లాడుకుందాం అంటూ పవన్ కత్తిపూడిలో జరిగిన వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.

హానికరమైన నురగను షాంపూ అనుకుని తలకు రుద్దుకున్న మహిళా భక్తులు.. వీడియో వైరల్..