బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో తాను చూస్తున్నది ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

సామాజిక తెలంగాణ బీసీ తెలంగాణకు తను పూర్తిగా మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. """/" / సకల జనులు ఉద్యమిస్తేనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ విజనరీ లీడర్ అని కొనియాడారు.2004 నుండి 2014 వరకు దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి.

కానీ మోడీ ప్రధాని అయ్యాక ఉగ్రదాడులను అరికట్టడం జరిగిందని స్పష్టం చేశారు.దేశంలో ఏదైనా ఉగ్రదాడి జరిగిందంటే వాళ్ళ దేశంలోకి వెళ్లి దాడులు చేస్తాము.

అన్న రీతిలో పరిస్థితులను తీసుకొచ్చారు.ఈ రకంగా ప్రతి భారతీయుడు గుండెల్లో ధైర్యం నింపారు.

అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ప్రధాని మోదీ అగ్రగామిగా నింపారని పవన్ స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ ( Narendra Modi )ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం లేదని దేశ ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని అన్నారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370( Article 370 ) రద్దు చేసి ఉండేవారు కాదు.

మహిళా బిల్లులు తెచ్చేవారు కాదు.ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదన్నారు.

దేశంలో మరోసారి మోదీ అధికారంలోకి రావాలని కోరారు.ఈ క్రమంలో "ఔర్ ఏక్ బార్ మోడీ" అంటూ నినాదించారు.

తెలంగాణలో మోదీ ఆధ్వర్యంలో బీసీ అధికారం సాకారం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

బైక్ రైడ్ చేస్తూ ఆశ్చర్యపరిచిన ఎలుగుబంటి.. రష్యాలో అంతే..?