ఆ సినిమాను అవసరమైతే యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనుకున్నా.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనే సంగతి తెలిసిందే.

పవన్ సినిమాల విషయంలో జగన్ సర్కార్ ఒకింత కఠినంగా వ్యవహరించడం ఒకింత హాట్ టాపిక్ అయింది.

అయితే తాజాగా ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భీమ్లా నాయక్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆయన వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను భీమ్లా నాయక్ ( Bheemla Nayak Movie )మూవీ రిలీజ్ కోసం ఎవరి కాళ్లు పట్టుకోవాలని అని అనుకోలేదని పేర్కొన్నారు.

అవసరమైతే ఆ సినిమాను ఫ్రీగా యూట్యూబ్ లో వదిలేస్తానని చెప్పానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ వెల్లడించిన సంచలన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

"""/" / మరోవైపు వైసీపీ ( YCP ) నుంచి మేనిఫెస్టో రిలీజ్ కావడంతో కూటమికి టెన్షన్ తగ్గింది .

జగన్ గతంలో అమలు చేసిన పథకాలనే మరోసారి అమలు చేసేలా మేనిఫెస్టోను సిద్ధం చేయడం విశేషం.

రాజకీయాల్లోకి తెగించి వచ్చానని పవన్ కళ్యాణ్ చెబుతుండగా జనసేన ఈ ఎన్నికల్లో 15 స్థానాలలో విజయం సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

అయితే ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చెప్పలేము. """/" / కూటమి, వైసీపీ హోరాహోరీగా గెలుపు కోసం కష్టపడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

కొన్ని నియోజకవర్గాల్లో మేనిఫెస్టో వైసీపీ గెలుపుపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జనసేన పార్టీకి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయని చెప్పాలి.వైసీపీ అమలయ్యే హామీలతో ప్రచారం చేస్తుండగా కూటమి అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

హెలీన్ హరికేన్: హాస్పిటల్‌ టెర్రస్‌పై చిక్కుకున్న 54 మంది.. వీడియో వైరల్‌..