నరసాపురం వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సంచలన హామీలు..!!
TeluguStop.com
ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురంలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నరసాపురంతో తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.
చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్తుండగా నరసాపురం బస్టాండ్ లో తాను తప్పిపోయినట్లు చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో ఓ వ్యక్తి దుకాణంలో కూర్చోబెట్టి వెయిట్ చేయించి నాన్న వచ్చాక అప్పగించారు అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో ప్రజలకు పలు హామీలు ప్రకటించారు.50 ఏళ్లు దాటిన బీసీలకు 4వేల పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపారు.
పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ప్రతి సంవత్సరం ₹15000 ఇస్తామన్నారు.ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
"""/" /
రైతులకు ఏడాదికి ₹20,000 సాయం చేస్తామని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
విశిష్ట వారధిని నిర్మిస్తామన్నారు.కోనసీమలో రైలు కూత వినిపిస్తుందని తెలిపారు.
అలాగే పోలవరం పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
దశాబ్ద కాలం కష్టాల మధ్య జనసేన పార్టీ పెరిగిందని చెప్పుకొచ్చారు.తాను దిగువ మధ్యతరగతి కుటుంబం వచ్చినట్లు చిన్న పట్టణాల్లో పెరిగినట్లు పేర్కొన్నారు.
ప్రతి మనిషి పడే కష్టం తనకి కూడా తెలుసు అని పవన్ వ్యాఖ్యానించారు.
తన అన్నయ్య చిరంజీవి నరసాపురంలో చదువుకున్నట్లు గుర్తు చేశారు.సీఎం జగన్ పై మాదిరిగా తనపై 32 కేసులు లేవని ఎద్దేవా చేశారు.
జగన్ లా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేను.ఆయనకు కాపుల ఓట్లు మాత్రమే కావాలి.
వారి అభివృద్ధి పట్టదు.నేను ఒక కులం కోసం పని చేయను.
రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీఏలో కలిసాం.కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.
ప్రతి చేనుకు నీరు.ప్రతి చేతికి పని.
ఇదే మా నినాదం ఆక్వా రైతులకు అండగా ఉంటామని నరసాపురం వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ ఇచ్చారు.