Pawan Kalyan Samantha : పవన్ సమంత కాంబోలో మిస్సైన సినిమా ఇదే.. ఆ సినిమాకు రవితేజ మూవీ టైటిల్ ను పరిశీలించారా?

పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) సమంత( Samantha ) కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు అత్తారింటికి దారేది సినిమా( Atharintiki Daaredi ) గుర్తుకొస్తుంది.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ , సమంత కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి.

ఈ సినిమాకు బెంగాల్ టైగర్( Bengal Tiger ) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం జరగడం గమనార్హం.

అయితే తర్వాత రోజుల్లో ఈ సినిమాలో కాజల్ ( Kajal ) హీరోయిన్ గా ఎంపిక కావడంతో పాటు సినిమా టైటిల్ కూడా మారిపోయింది.

అలా పవన్ కళ్యాణ్, సమంత కాంబినేషన్ మిస్ అయింది.రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

సర్దార్ గబ్బర్ సింగ్( Sardaar Gabbar Singh ) సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.

"""/" / సమంత సైతం పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.

ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గురువు గారు అంటూ సమంత కామెంట్స్ చేశారు.

పవన్ అంటే ఆ స్థాయిలో అభిమానం ఉందని సమంత కామెంట్లు చేయడం జరిగింది.

సమంత ప్రస్తుతం సినిమాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే త్వరలో సామ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.

"""/" / సమంత సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను గ్లామర్ ఫోటోషూట్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు.

సమంత పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి హోస్ట్ గా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు.

సమంత అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా కథలతో రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

పవన్, సమంతలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?