ట్రైలర్ తర్వాత అమాంతం పెరిగిపోయిన ‘బ్రో ది అవతార్’ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్..నాన్ రాజమౌళి రికార్డు పక్కానా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా నే కనిపిస్తుంది .

నిన్న మొన్నటి వరకు 'వారాహి విజయ యాత్ర' ( Varahi Yatra )పొలిటికల్ టూర్ తో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని వేడెక్కించబోతున్నాడు.

ఆయన హీరో గా నటించిన 'బ్రో ది అవతార్'( Bro The Avatar ) చిత్రం మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చెయ్యగా, దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అసలు ఈ రేంజ్ లో ఉంటుందని అభిమానులు కూడా ఊహించలేదు.ఎందుకంటే తమిళం లో ఈ సినిమా చాలా సాదాసీదాగా ఉంటుంది.

కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు.

"""/"/ ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రైలెర్ మొత్తం ఫుల్ జోష్ మీద కనిపించాడు.

ఆయన ఈ రేంజ్ ఎనర్జీ తో కనిపించి చాలా కాలమే అయ్యింది.రీ ఎంట్రీ తర్వాత వరుసగా ఆయన సీరియస్ సినిమాలే చేసాడు.

తన ఎంటర్టైన్మెంట్ జోన్ నుండి బయటకి వచ్చి ఇలా సీరియస్ జానర్ సింహేమాలు చెయ్యడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించిన విషయం.

అయితే ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ నుండి ఒకప్పటి ఎనర్జీ జోష్ తో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో సినిమా తియ్యడం అభిమానులకు ఎంతగానో నచ్చింది.

ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ తో నిండి ఉండగా, సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయి ఉంటుంది అట.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్( Bro Movie Overseas Bookings ) లో ప్రారంభం అయ్యాయి.

అక్కడ ట్రెండ్ ఎలా ఉందొ ఒకసారి చూద్దాం. """/"/ బ్రో మూవీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రైలర్ ముందుకు ఒకలాగా ,ట్రైలర్ కి తర్వాత మరొకలాగా ఉంది.

సాధారణంగా ఏ సినిమాకి అయినా ఇంతే, ట్రైలర్ లేకపోతే టికెట్స్ అమ్ముడుపోవు, కానీ 'బ్రో ది అవతార్' చిత్రానికి టికెట్స్ అమ్ముడుపోకముందే అమెరికాలో లక్షగా డాలర్లు వచ్చాయి.

సగటున రోజుకు 20 వేల డాలర్స్ వసూలు చేస్తూ వెళ్లిన ఈ సినిమా,ఇప్పుడు రోజుకి 70 వేల డాలర్స్ వసూలు చేసే రేంజ్ కి ఎదిగింది ట్రైలర్ తర్వాత జరిగిన ట్రెండ్ ఇది .

ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే వెళ్తే కచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్స్ నుండి 1 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఈ నెల 25 వ తారీఖున జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత బుకింగ్స్ మరింత పెరిగే అవాకాశాలు కూడా ఉన్నాయి.

దేవర సీక్వెల్ లో దేవర ఉంటాడా.. ఈ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ జవాబిదే!