పవన్ ‘బ్రో’ టికెట్ల రేట్ల పెంపు పరిస్థితి ఏంటి?
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రల్లో నటించిన బ్రో చిత్రం( Bro Movie ) మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు సదా సీదాగా జరుగుతున్నాయి.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా అంటే భారీ హైప్ ఉండడం కామన్.
కనుక ఈ సినిమా కి కూడా అదే స్థాయిలో హైపు క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు.
ఇక ఈ మధ్య కాలం లో స్టార్ హీరోల సినిమాలన్నింటికీ కూడా మొదటి వారం లేదా పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు( Movie Tickets Price ) అమాంతం పెంచే అవకాశం వెసులు బాటు కల్పిస్తున్నారు.
"""/"/
కానీ పవన్ కళ్యాణ్ సినిమా కు ఆ వెసులు బాటు ఉంటుందా లేదా అనేది అనుమానంగా మారింది.
తెలంగాణ లో సినిమా రేట్లు పెంచుకునేందుకు నిర్మాత కు ప్రభుత్వం ఓకే చెప్పినా కూడా ఏపీలో మాత్రం అక్కడి ప్రభుత్వం రాజకీయ కారణాలతో బ్రో సినిమా టికెట్ల రేట్లు( Bro Movie Ticket Price ) పెంచే అవకాశాలు కనిపించడం లేదంటూ టాక్ వినిపిస్తుంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా 100 కోట్ల కు పైగా బడ్జెట్ తో రూపొందింది.
కనుక మొదటి వారం రోజులు టికెట్ల రేట్లు పెంచితేనే నిర్మాత కు లాభం.
డిస్ట్రిబ్యూటర్లు కాస్త లాభం పొందుతారు.కానీ ఏపీ ప్రభుత్వం( AP Government ) అందుకు సహకరిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
"""/"/
గతం లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాల విషయం లో ఏపీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అందుకే ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ బ్రో సినిమా మరో సారి రాజకీయంగా ఏపీ లో చర్చనీయాంశమయ్యే అవకాశాలున్నాయి.
త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ డైలాగ్స్ ( Political Dialogues ) కొన్ని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయని కూడా వార్తలొస్తున్నాయి.
అదే జరిగితే సినిమా కి ఏపీ లో డ్యామేజ్ తప్పదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ సపోర్ట్ చెయ్యరు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!