పవన్ కళ్యాణ్‌ ‘బ్రో’ సినిమా ప్రివ్యూ

వకీల్‌ సాబ్‌.( Vakeel Saab Movie ) భీమ్లా నాయక్ సినిమాలతో వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )రేపు బ్రో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

భారీ అంచనాల నడుమ రూపొందిన బ్రో సినిమా షూటింగ్ లో పవన్ కేవలం 25 రోజులు మాత్రమే పాల్గొన్నాడు.

ఒక సినిమా కోసం అంత తక్కువ సమయం కేటాయించడం ఇదే మొదటి సారి.

సాయి ధరమ్‌ తేజ్( Sai Dharam Tej ) ఈ సినిమా లో ఎక్కువ సమయం కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

"""/" / ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.రేపు విడుదల కాబోతున్న బ్రో సినిమా( Bro Movie ) తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వినోదయ్య సీతం కు రీమేక్ అనే విషయం తెల్సిందే.

ఒరిజినల్ వర్షన్‌ కి దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకత్వంలోనే తెలుగు లో బ్రో సినిమా రూపొందింది.

హీరోయిన్ గా సాయి ధరమ్‌ తేజ్ కి కేతిక శర్మ నటించింది.కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది.

ఇక ఈ సినిమా ను ధమాకాతో సూపర్‌ హిట్‌ ను సొంతం చేసుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించడం జరిగింది.

భారీ ఎత్తున అంచనాలున్న బ్రో సినిమా దాదాపుగా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేయడం జరిగింది.

ఈ సినిమా వంద కోట్ల ను ఈజీగా వసూళ్లు చేస్తుందని.ముందు ముందు టాక్‌ ను వాతావరణ పరిస్థితులను బట్టి రూ.

200 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / పవన్ కళ్యాణ్‌ గత చిత్రాలు రీమేక్ అవ్వడం.అవి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల ఈ సినిమా కూడా రీమేక్ అవ్వడం సక్సెస్ కి ఎక్కువ స్కోప్ ఉందంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ సినిమా కు మొత్తం రచన వ్యవహారం త్రివిక్రమ్‌ చూసుకున్నాడు.అందుకే ఈ సినిమా ను చేసేందుకు పవన్ ఓకే చెప్పాడు అనేది కొందరి మాట.

ఈ సినిమా లో పవన్‌ ను దేవుడి పాత్రలో చూడబోతున్నాం.మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?