హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సింగపూర్ పర్యటన అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు.

ఆయనతో పాటు భార్య అన్నా లెజ్నోవా,( Anna Lezhneva ) కుమార్తె, చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్,( Mark Shankar Pawanovich ) కాకినాడ లోక్‌సభ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.

విమానాశ్రయంలో కొందరు పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు.

ఇకపోతే, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో( Singapore ) జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే.

ఈ ప్రమాదం రివర్ వ్యాలీ రోడ్‌లో ఉన్న మూడంతస్తుల భవనంలోని “సోప్ హౌస్” అనే ప్రదేశంలో టమాటో కుకింగ్ స్కూల్‌లో జరిగింది.

కుకింగ్ లెసన్స్‌ నిర్వహిస్తున్న సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగి 16 మంది చిన్నారులు గాయపడ్డారు.

ఈ సంఘటన తర్వాత సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

గాయపడిన చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించారు.మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లో పొగ చొచ్చుకుపోవడంతో ఐసీయూలో చికిత్స అందించారు.

"""/" / ఈ సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ హుటాహుటిన సింగపూర్‌కి వెళ్లారు.

మార్క్ డిశ్చార్జ్ అయ్యే వరకు కుటుంబ సభ్యులు అక్కడే ఉంటూ బాబుకు అండగా నిలిచారు.

ఇక ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి తిరిగి భారత్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా విమానాశ్రయంలో పవన్ తన కుమారుడిని ఎత్తుకుని కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ సమయంలో పవన్ పక్కనే భార్య అన్నా లెజ్నోవా, కుమార్తె కనిపించారు. """/" / అయితే, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడినందుకు కృతజ్ఞతగా తిరుమలకు వెళ్లాలని నిర్ణయించారు.

దింతో ఆయన కుటుంబ సభ్యలు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.సోమవారం తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం.

కుటుంబానికి ఎదురైన సంక్షోభం నుంచి బయటపడినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపనున్నారు.