సాయి తేజ్ సినిమా సీక్వల్ లో పవన్ కళ్యాణ్..?

దేవా కట్టా డైరక్షన్ లో సాయి ధరమ్​ తేజ్ హీరోగా వచ్చిన సినిమా రిపబ్లిక్.

ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన టైం లో సాయి ధరమ్​ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ఉండటంతో సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

ఇక జీ 5 లో డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియెన్స్ ను మెప్పించింది.

పొలిటికల్ సిస్టం మీద ఓ దమ్మున్న ఐ.ఏ.

ఎస్ చేసిన పోరాటమే రిపబ్లిక్ కథ.అయితే ఈ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారట దేవా కట్టా.

ఈ సీక్వల్ లో సాయి ధరమ్​ తేజ్ హీరోగా కాకుండా పవన్ కళ్యాణ్ ను పెట్టి తీసే ఆలోచనలో ఉన్నారట.

సాయి ధరమ్​ తేజ్ రిపబ్లిక్ సినిమాను చేసిన దేవా కట్టా పవన్ కళ్యాణ్ తో రిపబ్లిక్ 2 తీస్తాడని చెప్పుకుంటున్నారు.

పవన్ ఆల్రెడీ పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు.కాబట్టి ఇలాంటి సినిమాలు అతని పొలిటికల్ మైలేజ్ పెంచే అవకాశం ఉందని.

రిపబ్లిక్ 2 కథ నేరుగా పవన్ కే వినిపించి ఆయనతోనే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట దేవా కట్టా.

ఓ విధంగా దేవా కట్టా ఆలోచన అదిరిపోయిందని చెప్పొచ్చు.ఇది వర్క్ అవుట్ అయితే అతను కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరుతాడు.

2025 లో కూడా మనవాళ్ళు బాలీవుడ్ కు చెమటలు పట్టించడం పక్కానా..?