హరీష్ తో పవన్ సినిమా ఉందట.. కానీ.. భగత్ సింగ్ కాదట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మునపటి కంటే ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.

ఈయన ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఆపకుండా సినిమాలు చేస్తాడు అని అనుకుంటే పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమాలకు గ్యాప్ తప్పలేదు.

పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే వీరి కాంబోలో సినిమా ప్రకటించారు కూడా.ఈ క్రేజీ కలయికలో ''భవదీయుడు భగత్ సింగ్'' సినిమాను ప్రకటించారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యింది కానీ ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో అసలు పవన్ ఈ సినిమాను చేస్తాడా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి.

ప్రెజెంట్ పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.కానీ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడంలో విఫలం అయ్యారు.

దీంతో హరీష్ శంకర్ మరో హీరోతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి.

"""/"/ ఇక ఇప్పుడు పవన్, హరీష్ కలిసి పనిచేయడానికి సిద్ధం అయ్యారని టాక్ వస్తుంది.

అయితే ముందుగా ప్రకటించిన విధంగా భవదీయుడు భగత్ సింగ్ కాకుండా మరో కథతో రాబోతున్నారు అని తెలుస్తుంది.

అది కూడా రీమేక్ అని టాక్.తేరి అనే తమిళ్ సినిమాను రీమేక్ చేయబోతున్నారు అని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి.

మరి ఇప్పుడు హరీష్ తో సినిమా చేస్తున్న కూడా ప్లాన్ మార్చుకుని తేరి రీమేక్ తో రాబోతున్నారట.

ఈ ఐడియా పవన్ దే అని కూడా తెలుస్తుంది.ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరిగాయని అన్ని కుదిరితే కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి ఇది అయిన సెట్ అవుతుందో లేదో చూడాలి.