చిత్తూరు జిల్లా ఇంటర్ విద్యార్థి అత్యాచార ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్..!!
TeluguStop.com
చిత్తూరు జిల్లా( Chittoor District )లో ఇంటర్ విద్యార్థిని చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందించారు.
"ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలక పక్షం, మహిళా కమిషన్ - రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది.
ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా? చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్ధిని కిరాతకంగా హత్యకు గురైతే ముఖ్యమంత్రిగానీ, హోమ్ శాఖ మంత్రిగానీ, మహిళా కమిషన్ బాధ్యురాలుగానీ ఎందుకు స్పందించటం లేదు.
అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు దురాగతం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ బాలిక తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా కలచి వేసింది.
మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటే రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ, శాంతి భద్రతల స్థితి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది.
రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరవైంది అనే మాట వాస్తవం.మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులు కూడా పాలక పక్షం కట్టేస్తోంది.
దిశ చట్టాలు చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు( Disha Police Station ) పెట్టాం అనే పాలకుల ప్రకటనలు ఏ మాత్రం రక్షణ ఇవ్వడం లేదు.
వైసీపీ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి" అని పవన్ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగంలో పోస్ట్ చేశారు.
ప్రముఖ హోటల్ బిర్యానీలో ప్రత్యక్షమైన సిగిరెట్.. గొడవకు దిగిన కస్టమర్స్