సత్యదేవ్ సినిమాపై పవన్ ప్రశంసలు… ఆనందంలో చిత్ర యూనిట్

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకీ ప్రత్యేకంగా విష్ చేశారు.

పులి షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ తో సత్యదేవ్ కాలేజీ చదివే రోజుల్లో తీసుకున్న ఫోటోని షేర్ చేసి అప్పటి మెమొరీస్ ని గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే పవన్ కళ్యాణ్ తనకి పుట్టిన రోజు విషెష్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరల థాంక్స్ చెప్పారు.

అలాగే సత్యదేవ్ కి కూడా థాంక్స్ చెప్పడంతో పాటు ఆయన రీసెంట్ గా నటించిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రీసెంట్ గా మీరు నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూశానని, అందులో మీ యాక్టింగ్ చాలా బాగుందని, మీ నటన ఆశ్వాదించానని రిప్లై ఇచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చూడటం అనేది చాలా రేర్.అతను చేసిన సినిమా కూడా చూడటానికి చాలా టైం తీసుకుంటాడు.

గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.అత్తారింటికి దారేది సినిమాని ఆయన వంద రోజుల తర్వాత చూసారని చెప్పుకొచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా చూడటం, ఆ సినిమా బాగుందని ప్రశంసించడం చాలా అరుదుగా జరుగుతుంది.

అలాంటి అరుదైన అవకాశం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాకి వచ్చింది.దీంతో పవన్ కళ్యాణ్ రిప్లై చూసి సత్యదేవ్ ఉద్వేగానికి గురయ్యాడు.

ఈ విషయాన్ని ఆయన మరల ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.మీరు ఇచ్చిన ఈ కంప్లిమెంట్ నాకు చాలా గుర్తుండిపోతుంది.

నిజంగా ఇది మాటల్లో చెప్పలేని ఆనందం.మీరు నాకు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ అనేది నాతో పాటు మా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య టీమ్ మొత్తానికి ఉద్వేగాన్ని కలిగించేది.

థాంక్యూ అని సత్యదేవ్ ట్వీట్ చేశారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ నుంచి ఉమామహేశ్వర టీమ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందిన గొప్ప ప్రశంస ఇదని చెప్పొచ్చు.

హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య.. పరారీలో భోలే బాబా..