రైతుల కోసం పవన్ కళ్యాణ్ అమరావతి టూర్ ప్లాన్! డేట్ ఫిక్స్

మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎమర్జింగ్ అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజల మధ్యకి వస్తూ, అలాగే పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతూ వారిని ఉత్తేజపరుస్తున్నారు.

అదే సమయంలో ప్రజల నమ్మకం పొందేందుకు ఉన్న అన్ని రకాల మార్గాలు ప్రయత్నం చేస్తున్నారు.

అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపేందుకు ఏ ఒక్క అవకాశం ఉన్న అస్సలు వదులుకోవడం లేదు.

దూకుడైన రాజకీయాలు చేస్తూ రాబోయే రోజుల్లో జగన్ కి ప్రత్యామ్నాయం తానే అనే సంకేతాలు ప్రజల్లోకి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ అయిన మూడు రాజధానుల అంశాన్ని తీసుకొని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

అమరావతి రైతులకి భరోసా ఇస్తూ అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే అమరావతి రాజధాని తరలింపు అనే అంశం తెరపైకి వచ్చిన తర్వాత అక్కడ రెండు సార్లు పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడో సారి కూడా వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు.

అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులకి ధైర్యం ఇచ్చి వారికి అండగా ఉండేందుకు సిద్ధమయ్యారు.

దీని కోసం ఈ నెల 15 ముహూర్తం ఖరారు చేసుకున్నారు.నిజానికి 10వ తేదీన అమరావతి వెల్లాలని అనుకున్న రాయలసీమ టూర్ ని 12, 13 తేదీలలో ప్లాన్ చేసుకోవడం వలన అమరావతి షెడ్యూల్ ని 15న వాయిదా వేసుకున్నారు.

ఈ విషయాన్ని జనసేన అఫీసియల్ గా ప్రకటించింది.అక్కడికి వెళ్లి రైతుల తరుపున గొంతు వినిపించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తారని తెలుస్తుంది.

వారి కోసం బీజేపీతో కలిసి లాంగ్ మార్చ్ చేయాలని భావించిన ఏవో కారణాల వలన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఈ నేపధ్యంలో రైతులకి భరోసా కల్పించే ప్రయత్నం అయిన చేయాలని టూర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ లో చుడీదార్ గ్యాంగ్ కలకలం