సాయిధరమ్ తేజ్ ను తలుచుకుని స్టేజ్ పై కన్నీరు పెట్టిన పవన్ కళ్యాణ్..?
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మనందరికీ తెలిసిందే.సాయి ధరమ్ తేజ్ కి 2021 సెప్టెంబర్ లో బైక్ ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా భయాందోళనకు గురయ్యారు.సాయి కి గాయాలు ఎక్కువగా అవడంతో పరిస్థితి చాలా విషమంగా మారింది.
స్థానిక ఆసుపత్రిలో చేర్చి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రిలో చికిత్సను అందించారు.
అలా దాదాపుగా నెలరోజుల పాటు సాయి ధరమ్ తేజ్ బెడ్ కే పరిమితమయ్యాడు.
ఆ సమయంలో మెగా ఫ్యామిలీ చాలా భయపడిన విషయం మనందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఆ సంఘటన మెగా ఫ్యామిలీని ఎంతగానో కలిసిపోతుంది అని చెప్పవచ్చు.
తాజాగా ఇదే ఇన్సిడెంట్ నీ పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు షోలో గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.సాయి ధరమ్ తేజ్ కి జరిగిన ఆక్సిడెంట్ విషయం గురించి మొదట నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పారు.
"""/"/అప్పుడు వెంటనే నేను ఆసుపత్రికి వెళ్లాను.హాస్పిటల్ కి వెళ్లి సాయి ధరమ్ తేజ్ ని చూసి చలించిపోయాను.
ప్రమాదం జరిగే మూడు రోజులు అవుతున్నా కూడా సాయి ధరమ్ తేజ్ కోమాలో నుంచి బయటకు రాలేదు.
ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురయ్యాను. """/"/
అంతకుమించి బయట జరుగుతున్న ప్రచారం నన్ను మరింత కలిసి వేసింది.
ఓవర్ స్పీడ్ లో బైక్ నడిపారు తాగి ఉన్నాడు అంటూ ఎన్నో రకాల కథనాలు తెరపైకి తీసుకువచ్చారు.
అవన్నీ విన్నప్పుడు చాలా బాధ వేసింది.నా ముందు సాయి ధరమ్ తేజ్ చాలా వినయంగా ఉంటాడు.
చిన్నప్పటినుండి అలానే పెరిగారు అని చెప్పుకొచ్చారు.సాయి ధరమ్ తేజ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్.
ఆ సమయంలో షోలో ఉన్న చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే షో మధ్యలో సాయి ధరమ్ తేజ్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.