‘బుక్ మై షో’ యాప్ లో ‘ఓజీ’ ప్రభంజనం..48 గంటల్లో అన్ని రికార్డ్స్ అవుట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురు చూస్తున్న సినిమా 'ఓజీ'.

'రన్ రాజా రన్' మరియు 'సాహూ' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

"""/" / ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన మొదటి గ్లిమ్స్ వీడియో ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చేసారు.

దీనికి అభిమానులు మరియు ఆడియన్స్ దగ్గర నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా నార్త్ ఇండియా లో అయితే ఈ గ్లిమ్స్ వీడియో కి వేల సంఖ్యలో రియాక్షన్ వీడియోస్ వచ్చాయి.

ఎక్కడ చూసినా ఈ గ్లిమ్స్ వీడియో గురించే చర్చ. """/" / యూట్యూబ్ లో ఇప్పటి వరకు రెండు కోట్ల 40 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఇంకా టాప్ లోనే ట్రేండింగ్ అవుతూ ఉంది.ఇంత లాంగ్ పీరియడ్ లో ట్రెండ్ అయినా గ్లిమ్స్ వీడియో ఈమధ్య కాలం లో రాలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రొఫైల్ ని 'బుక్ మై షో'( Book My Show ) ఆన్లైన్ టికెట్ సేల్స్ యాప్ లో యాడ్ చేసారు.

యాడ్ చేసిన వెంటనే ఈ ప్రొఫైల్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోని అన్నీ ప్రాంతాలలో నెంబర్ 1 స్థానం లో ట్రెండింగ్ అవుతుంది.

రీసెంట్ గా విడుదలైన కొత్త సినెమాలు 'జవాన్'( Jawan ) మరియు 'మిస్ శెట్టి.

మిస్టర్ పోలిశెట్టి'( Miss Shetty Mr Polishetty ) వంటి వాటిని కూడా డామినేట్ చేస్తూ నెంబర్ 1 స్థానం లో ట్రెండ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇప్పటి వరకు ఈ చిత్రానికి 'బుక్ మై షో' యాప్ లో 14 వేలకు పైగా ఇంట్రెస్ట్ లైక్స్ వచ్చాయి.

ప్రొఫైల్ ని యాడ్ చేసి కనీసం రెండు రోజులు కూడా అవ్వలేదు. """/" / అప్పుడే ఈ స్థాయిలో ట్రెండింగ్ అవుతుంది అంటే ఈ చిత్రం పై హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

గతం లో అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న 'పుష్ప : ది రూల్ ' చిత్రానికి ఈ రేంజ్ ట్రెండింగ్ ఉండేది.

10 వేల లైక్స్ రీచ్ అవ్వడానికి ఆ చిత్రానికి 48 గంటలు పట్టింది.

కానీ 'ఓజీ'( OG ) చిత్రానికి కేవలం 24 గంటల సమయం మాత్రమే పట్టింది.

ఇది ఇండియాలోనే ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.ప్రస్తుతానికి విడుదల అవ్వబొయ్యే సినిమాలలో అత్యధిక ఇంట్రెస్ట్ లైక్స్ ఉన్న సినిమా 'సలార్'.

ఈ చిత్రానికి దాదాపుగా 3 లక్షల 44 వేల లైక్స్ ఉన్నాయి, ఆ తర్వాత పుష్ప ది రూల్, హరి హర వీరమల్లు, కల్కి( Kalki ) మరియు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కొనసాగుతున్నాయి.

మరి 'ఓజీ' చిత్రం వీటిని రాబొయ్యే రోజుల్లో బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!