‘ఓజి’ : అప్పుడే రికార్డుల వేట షురూ.. ఏ సినిమా గ్లింప్స్ సెట్ చేయని రికార్డ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల నుండి పుట్టిన రోజు విషెష్ అందుకున్నారు.

నెట్టింట కూడా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.అలాగే పవన్ సినిమాల నుండి బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.

"""/" / మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఓజి( OG Movie ) నుండి కూడా ట్రీట్ వచ్చింది.

'ఓజి' నుండి టీజర్ రిలీజ్ చేసారు.చెప్పినట్టుగానే మేకర్స్ ఈ టీజర్ ను 10.

35 కు రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.ఇక ఈ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూసారో నిరూపించారు.

టీజర్ అప్పుడే రికార్డులను తిరగ రాస్తూ దూసుకు పోతుంది.టీజర్ రిలీజ్ అయిన కొద్దీ గంటలోనే ఒక రికార్డ్ సెట్ చేసింది.

ఈ గ్లింప్స్ ఇండియా వైడ్ గా ఫాస్టెస్ట్ ఎవరు రికార్డ్స్ నెలకొల్పింది.ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ నుండి 5 లక్షల లైక్స్ వరకు కూడా ఇండియన్ సినిమా దగ్గర ఏ గ్లింప్స్ నమోదు చెయ్యలేదు.

ఆ రికార్డ్ ఇప్పుడు పవన్ ఖాతాలో పడింది.దీంతో పవన్ అప్డేట్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.

"""/" / ఈ టీజర్( OG Teaser ) ఇప్పటికే 522కే లైక్స్ అందుకుంది.

అలాగే 3.4 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది.

ముంబై గ్యాంగ్ స్టర్ గా పవన్ లుక్, స్టైల్ అంతా కూడా ఆకట్టుకోగా ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.

ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా